Tuesday, January 19, 2010

తెలంగాణ ఉద్యమంలో నేలరాలిన విద్యార్థి


తెలంగాణా ఉద్యమంలో ఇవ్వాల మళ్ళీ ఒక విద్యార్థి నేలరాలడు. ఘట్ కేసర్ లోని లలిత పీజీ కాలేజీలో ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న కొండేటి వేణుగోపాల్ అనే విద్యార్థి ఇవ్వాల ఉదయం 5 గంటల ప్రాంతంలో ఉస్మానియా యునివర్సిటీలోని టాగూర్ ఆడిటోరియం దగ్గర కాల్చుకొని చనిపోయాడు. ఉద్యామాలు నిర్వహిస్తున్న నాయకత్వం పోరాటం ద్వారా తేలంగాణా సాధించుకుందాం అని పిలుపు ఇవ్వడం కాకుండా ఆమరణ దిక్షల ద్వారా,ఆత్మాహుతుల ద్వారా సాధించుకుందాం అని పిలుపులు ఇవ్వడం వలన నేటికి 190 మందికి పైగా ఏఅమరులు అయ్యరు. దీనికి కారనం మత్రం ముమ్మాటికి ఉద్యమ నయకత్వనిదే. తెలంగాణా నేలకు పోరాట శక్తి ఉంది. నాటి సాయుధపోరాటంలో 4000 మంది నిజం సైన్యానికి,భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి నేలకొరిగారు కాని అత్మహత్యల ద్వారా చనిపోలేదు.నయకత్వం విద్యార్థులకి, యువకులకు ఆలంటి మర్గదర్షకత్వాన్ని ఇవ్వాలి.